- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mathura: మథురలో 15 దుకాణాల నుంచి 43 ఆహారపదార్థాల సేకరణ
దిశ, నేషనల్ బ్యూరో: తిరుమల లడ్డూ వివాదం చెలరేగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ లో అధికారులు అప్రమత్తమయ్యారు. మథురలో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం పలు దుకాణాల నుంచి ఆహారపదార్థాల నమూనాలను సేకరించింది. సోమవారం మథుర, బృందావన్ సహా సమీప ప్రాంతాల్లోని 15 దుకాణాల నుంచి 43 ఆహారపదార్థాలను సేకరించింది. ఎఫ్‌ఎస్‌డీఏ అసిస్టెంట్ కమిషనర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. మథుర, బృందావన్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో 15 మంది విక్రేతల నుండి 43 నమూనాలను సేకరించినట్లు తెలిపారు. ఆలయాల చుట్టుపక్కల ఉన్న దుకాణాల నుంచి ఆది, సోమవారాల్లో నమూనాలను సేకరించినట్లు వెల్లడించారు. నమూనాలు సేకరించిన వాటిలో పాలు, పన్నీర్, పేడా, బర్ఫీ, మిల్క్ కేక్, రసగుల్లా, ఇమర్తి, సోన్‌పాపిడి, సహా పలుస్వీట్లు ఇన్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే, అందులో 42 ఆహార పదార్థాలు నిబంధనలకు లోబడే ఉన్నట్లు గుర్తించామన్నారు. కానీ 'పెడా' నమూనాను టెస్టింగ్ కోసం లక్నోకు పంపామని చెప్పారు.
శ్రీకృష్ణజన్మాష్టమి రోజు ఫుడ్ పాయిజనింగ్
మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు 120 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. కాగా.. ఫరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 120 మందికి జన్మాష్టమి రోజున పిండితో చేసిన పూరీలు, పకోడాలు తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీనిపైనే ముగ్గుర సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. ఇకపోతే, తిరుపతి లడ్డూ వివాదం, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఫుడ్ పాయిజనింగ్ తో.. అధికారులు ముందస్తుగా దుకాణాల్లోని నమూనాలు సేకరించి పరీక్షలు చేపట్టారు.