ఏడీజీగా బాధ్యతలు స్వీకరించిన శిఖా గోయల్

by Nagaya |   ( Updated:2023-01-09 13:59:52.0  )
ఏడీజీగా బాధ్యతలు స్వీకరించిన శిఖా గోయల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణా రాష్ట్ర పోలీస్ మహిళా భద్రతా విభాగం కొత్త హెడ్‌గా శిఖా గోయెల్ ఐపీఎస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ విభాగానికి అధిపతిగా పని చేసిన స్వాతి లక్రా నుంచి ఆమె ఛార్జ్ తీసుకున్నారు. శిఖా గోయల్ ఇప్పటి వరకు ఏసీబీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఐపీఎస్ ల బదిలీల్లో ఏసీబీ డైరెక్టరుగా ఉన్న శిఖా గోయల్ ను షీ టీములు, భరోసా, మహిళా భద్రత విభాగాలకు ఏడీజీగా బదిలీ చేసింది. ఇప్పటి వరకూ ఈ బాధ్య తలు నిర్వహించిన స్వాతి లక్రాను టీఎస్ ఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగా బదిలాయించారు.

Advertisement

Next Story