- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ నేతలకు ఆ రెండే తెలుసు.. జాతీయ మహిళా కమిషన్‌కు షర్మిల ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష పార్టీల నేతలపై బెదిరింపులకు, దాడులకు దిగుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మకు బీఆర్ఎస్ నేతలపై షర్మిల ఫిర్యాదు చేశారు. తనను అసభ్యకరంగా దూషించిన వీడియోలను మహిళా కమిషన్‌కు అందజేసినట్లు షర్మిల వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో నేతలకు మహిళలంటే గౌరవం లేదనే విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న తనపై దాడులకు దిగారని వివరించారు. ఎలా బయట తిరుగుతావో చూస్తామంటూ పబ్లిక్‌గానే బెదిరిస్తున్నారని జాతీయ మహిళా కమిషన్ ఎదుట షర్మిల వాపోయారు.
తెలంగాణలో మహిళలకు గౌరవం, రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్ ఆడవాళ్లను వ్రతాలు చేసుకోవాలనే కామెంట్ చేశారని, మరో మంత్రికి మహిళలంటే మరదలితో సమానమని అంటున్నాడని, ఒక ఎమ్మెల్యే అయితే మహిళ అని చూడకుండా కొజ్జా అని విమర్శలు చేశారన్న విషయాలను మహిళా కమిషన్ దృష్టికి షర్మిల తీసుకెళ్లారు. ప్రజాసమస్యలపై మాట్లాడితే.. శిఖండి అని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని షర్మిల వాపోయారు. ఇదిలా ఉండగా ఈ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అసభ్యకర పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని షర్మిల వెల్లడించారు.