మినిస్టీరియల్​స్టాఫ్​సేవలు ప్రశంసనీయం: డీజీపీ రవి గుప్తా

by Mahesh |
మినిస్టీరియల్​స్టాఫ్​సేవలు ప్రశంసనీయం: డీజీపీ రవి గుప్తా
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మినిస్టీరియల్​సిబ్బంది పోలీసు శాఖకు వెన్నుముకలా పని చేస్తున్నారని డీజీపీ రవిగుప్తా అన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడానికి సిబ్బంది అందరూ కుటుంబ సభ్యుల్లా సమిష్టిగా పని చేస్తే మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ నాన్​గెజిటెడ్​అధికారుల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. దీంట్లో పాల్గొన్న డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ పోలీసు బాధ్యతలు ఒత్తడితో కూడుకుని ఉంటాయన్నారు. సవాళ్లను అధిగమిస్తూ విధి నిర్వహణలో నిబద్దతతో పని చేయాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఎంత వేగంగా స్పందిస్తే ప్రజలకు అంత మేలు జరుగుతుందన్నారు.

ఎలాంటి సమస్యలు ఉన్నా సిబ్బంది తన దృష్టికి తీసుకు రావచ్చని చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీజీపీలు శిఖా గోయల్, అభిలాషా బిస్త్, మహేశ్​భగవత్, సంజయ్​కుమార్​జైన్, ఐజీలు రమేశ్, తరుణ్​జోషి, స్టీఫెన్​రవీంద్ర, సీఐడీ ఎస్పీ అపూర్వ రావు, ఏఐజీ నాగరాజు పాల్గొన్నారు. డీజీపీ కార్యాలయ నాన్​గెజిటెడ్​అధికారుల సంఘం కార్యదర్శి శివరంజని ప్రారంభోపన్యాసం చెయ్యగా సంఘం అధ్యక్షుడు పవన్​కుమార్​వందన సమర్పణ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి, సభ్యులు శ్రీనివాస్​రెడ్డి, శంకర్​రెడ్డి, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed