- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KCR ఎన్డీఏలో చేరే ప్రయత్నం నిజమే.. తెలంగాణ ఇంటెన్షన్స్ తాజా సర్వేలో సంచలన విషయాలు..!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, ఆయన ఫ్యామిలీపైనా, బీఆర్ఎస్‌పైనా విరుచుకుపడిన ప్రభావం వేర్వేరు రూపాల్లో వ్యక్తమవుతున్నది. ప్రధాని స్పీచ్‌తో బీజేపీ గ్రాఫ్ రెండు శాతం పెరిగినట్లు తెలంగాణ ఇంటెన్షన్స్ అనే సంస్థ తాజాగా చేసిన సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమిలో చేరడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించారని మోడీ బహిరంగంగా వ్యాఖ్యానించింది నిజమే కావచ్చని 27% మంది ప్రజలు అభిప్రాయపడినట్లు తేలింది. కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయడానికి వీలుగా మోడీ ఆశీస్సులు పొందేందుకు కేసీఆర్ ప్రయత్నించింది కూడా నిజమే కావచ్చని మరో 9% మంది ఫీలయ్యారు. తెలంగాణ సంపదను తొమ్మిదేళ్ళలో కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నట్లు 31% మంది అభిప్రాయపడ్డారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఫండింగ్ చేసినట్లు మోడీ చేసిన వ్యాఖ్యలతో 34% మంది ఏకీభవించారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిని వెలికి తీస్తానంటూ మోడీ చేసిన హెచ్చరిక కార్యరూపం దాల్చే అవకాశముందని 24% మంది అభిప్రాయపడ్డారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించడానికి దారితీస్తుందని మరో 19% మంది అభిప్రాయపడ్డారు. గత వారం జరిగిన సర్వేలో బీజేపీకి కేవలం 8% విజయావకాశాలు ఉంటే మోడీ నిజామాబాద్ సభ తర్వాత గ్రాఫ్ 2% మేర పెరిగి 10 శాతానికి చేరుకున్నట్లు ఈ సర్వేలో తేలింది. బీఆర్ఎస్ 40%, కాంగ్రెస్ 34% చొప్పున ఓట్ షేరింగ్ పొందే అవకాశమున్నట్లు స్పష్టమైంది.