కేకే BRSను వీడటంపై కుమారుడు విప్లవ్ కుమార్ సంచలన రియాక్షన్

by Sathputhe Rajesh |
కేకే BRSను వీడటంపై కుమారుడు విప్లవ్ కుమార్ సంచలన రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తన తండ్రి బీఆర్ఎస్ పార్టీని వీడటంపై కుమారుడు విప్లవ్ కుమార్ స్పందించారు. కుమార్తె ఒత్తిడితోనే కేశవరావు పార్టీ మారారని తెలిపారు. కేకే ఇప్పుడైనా పునరాలోచన చేసుకోవాలని సూచించారు. గద్వాల విజయలక్ష్మీ బీఆర్ఎస్‌కు చేసింది ద్రోహమే అన్నారు. విజయలక్ష్మీ మేయర్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలన్నారు. రేవంత్ రెడ్డి తమ కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారని విప్లవ్ మండిపడ్డారు. తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని విప్లవ్ కుమార్ ఇటీవల తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story