పోలీసులే ఆయనను అడవిలోకి పంపారు.. మావోయిస్టుల సంచలన లేఖ

by Rajesh |
పోలీసులే ఆయనను అడవిలోకి పంపారు.. మావోయిస్టుల సంచలన లేఖ
X

దిశ, భద్రాచలం : కొంగాల అడవుల్లో కర్రిగుట్టపై వేటకు వెళ్లి బూభీ ట్రాప్ తొక్కడంతో అది పేలి మరణించిన ఇల్లందుల ఏసు మృతి పట్ల చింతిస్తున్నామని మావోయిస్టు కార్యదర్శి శాంత పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. ఇల్లందుల ఏసును మావోయిస్టుల సమాచారం తెలుసుకోవాలని అడవులకు పంపింది పోలీసులేనని లేఖలో ఆరోపించారు. ఏసు మృతికి పోలీసులే బాధ్యత వహించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. సామ్రాజ్యవాద, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అడవులను వారికి కట్టబెట్టడానికి, అడవులపై ఆదివాసీలకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడమే అధికారులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై, ప్రజలపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు తిరిగే ప్రాంతాలలో మందు పాతరలను అమర్చడం లేదని, ఎత్తైన గుట్ట ప్రాంతాలలో అనేక బూబీ ట్రాప్‌లను అమర్చామని, ఈ విషయం పరిసర గ్రామాల ప్రజలకు చెప్పి అడవుల్లోకి రావద్దని తెలిపామని పేర్కొన్నారు. కానీ ఏసును బలవంతంగా పోలీసులే అడవుల్లోకి పంపారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed