- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Diwali 'KTR bombs' : దీపావళి వేళ మార్కెట్లోకి ‘కేటీఆర్ బాంబులు’.. ఫోటోలు వైరల్

దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి Diwali పండుగ సందర్భంగా దీపాలతో ఇంటిని అలంకరిస్తారు. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్తులు ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ దీపావళి సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యంగా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ టపాసులు కాలుస్తుంటారు. అయితే, మార్కెట్‌లోకి కొత్త కొత్త టపాసుల బ్రాండ్స్ వస్తున్నాయి. సినిమా స్టార్స్, దేవుళ్ల ఫోటోలతో మార్కెట్‌లోకి కొన్ని టపాసులు రావడం మనం చూసే ఉంటాము. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కేటీఆర్ ఫోటోతో ఉన్న టాపాసుల ప్యాకెట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ శ్రేణులు ఆ ఫోటోను షేర్ చేస్తున్నాయి. అయితే ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు మూడు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలుతాయని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి ‘మా శివకాశీ పటాకా (కేటీఆర్) దెబ్బ చూస్తే అబ్బా అంటావ్.. అని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.