బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయం ప్రారంభం..

by Kalyani |
బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయం ప్రారంభం..
X

దిశ, కార్వాన్: ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు ఫిబ్రవరి 17 కుల గణన సర్వే కోసం శాసనసభలో తీర్మానం చేయడం జరిగిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. సోమవారం మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య భవన్ లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యాబినెట్ ఆమోదం తో జీవో నెంబర్ 18 ద్వారా సమగ్ర కుల గణన సర్వే చేయడానికి ప్లానింగ్ కమిషన్ కి ఇవ్వడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఈ ప్రభుత్వం సముచిత న్యాయం చేయాలని ప్రభుత్వం ఉందని తెలిపారు. బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను బలహీన వర్గాల బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీకాంత్ గౌడ్ సిల్క్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా కుల వృత్తులు ప్రోత్సహించడానికి కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. కుల గణన సర్వే, ప్రభుత్వం నుంచి బలహీన వర్గాలకు అందే కార్యక్రమాలు అయినా ప్రజలకు జీవనోపాధి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి విద్యలో వారికి ఎలాంటి ఆటంకం లేకుండా పర్యవేక్షణ చేస్తామని పేర్కొన్నారు. శ్రీకాంత్ గౌడ్ ఆలోచనలు ముందుకు తీసుకుపోవాలి. వారికి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed