Weather Report : తెలంగాణలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

by M.Rajitha |
Weather Report : తెలంగాణలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
X

దిశ, వెబ్ డెస్క్ : గతవారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. అల్పపీడనం(ALP)గా మారింది. అది మరింత బలహీనపడి ఆవర్తనంగా మారినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఆవర్తనం మరింత బలహీన పడటం వల్ల తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తూ.. క్రమంగా చలి పెరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు కూడా చేరుకుంటున్నాయి. పగటి పూట తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇక సాయంత్రం కాగానే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 18 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణమే కొనసాగుతోండగా.. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితే ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

Next Story