టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి వినతి

by Mahesh |
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(' MLC elections) ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్ల(SGT)కు ఓటు హక్కు కల్పించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే 80 శాతం ఉపాధ్యాయులు ఉన్నత విద్యావంతులుగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. 1950లో చేసిన చట్టాన్ని సవరించి ఓటు హక్కు కల్పించాలని వారు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా కేంద్ర మంత్రి దీనిపై సానుకూలంగా స్పందించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో పూర్వ శాసనమండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed