Iran : మోటొరోలా ఫోన్ల క్రయవిక్రయాలు, దిగుమతిపై ఇరాన్ బ్యాన్

by Hajipasha |
Iran : మోటొరోలా ఫోన్ల క్రయవిక్రయాలు, దిగుమతిపై ఇరాన్ బ్యాన్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితికి ఇరాక్ సోమవారం ఫిర్యాదు చేసింది. అక్టోబరు 26న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తమ గగనతలం నుంచి ఇరాన్‌పై దాడికి పాల్పడ్డాయని ఐరాసకు తెలిపింది. ఇలాంటి చర్యల ద్వారా తమ దేశ సార్వభౌమాధికారానికి ఇజ్రాయెల్ తీవ్ర విఘాతం కలిగించిందని ఇరాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమేరకు ఫిర్యాదు లేఖను ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, ఐరాస భద్రతా మండలికి ఇరాక్ పంపింది. ఈవిషయాన్ని ఇరాక్ ప్రభుత్వ అధికార ప్రతినిధి బాసిమ్ అలవాది ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికాకు కూడా దీనిపై సమాచారాన్ని అందిస్తామని ఆయన చెప్పారు.

హైఫాపైకి హిజ్బుల్లా రాకెట్లు

లెబనాన్‌లోని టైర్ నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఏడుగురు చనిపోయారు. 17 మందికి గాయాలయ్యాయి. ఈ దాడికి స్పందించిన హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంపైకి పెద్దసంఖ్యలో రాకెట్లు సంధించింది. హైఫాలోని ఇజ్రాయెల్ నౌకాదళ స్థావరంపై కూడా రాకెట్లు పడినట్లు తెలిసింది. పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై సోమవారం ఇజ్రాయెల్ దాడుల్లో 32 మంది చనిపోయారు.

మోటొరోలా ఫోన్లపై ఇరాన్ బ్యాన్

హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా నెలక్రితం లెబనాన్‌(Lebanon)లో పేజర్లు పేలిన నేపథ్యంలో ఇరాన్(Iran) కీలక నిర్ణయం తీసుకుంది. మోటొరోలా(Motorola) మొబైల్ ఫోన్ల దిగుమతి, వినియోగం, విక్రయాలపై బ్యాన్ విధించింది. ఇరాన్ పరిధిలో ఆన్‌లైన్‌లోనూ మోటొరోలా ఫోన్ల సేల్స్‌ను ఆపేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని విమానాల్లో వాకీటాకీలు, పేజర్ల వినియోగాన్ని కూడా ఇరాన్ ఇటీవలే నిషేధించింది.

Advertisement

Next Story