- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NESF-Slice: నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో స్టార్టప్ కంపెనీ స్లైస్ విలీనం.. ఇకనుంచి ఒకే బ్యాంకింగ్ సంస్థగా సేవలు..!
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు(Bangalore)కు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థ 'స్లైస్(Slice)' తమ బిజినెస్(Business)ను నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్(NESF) బ్యాంకులో విలీనం చేసినట్లు ప్రకటించింది. ఈ విలీనానికి అవసరమైన షేర్ హోల్డర్(Shareholder), రెగ్యులేటరీ అనుమతులు(Regulatory Approvals) పొందినట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) పొందిన ఒక సంవత్సరం తర్వాత విలీన ప్రక్రియ పూర్తయినట్లు పేర్కొంది. అక్టోబర్ 27, 2024 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు సోమవారం ఓ ప్రకటన లో తెలిపింది. దీంతో స్లైస్ కంపెనీకి చెందిన వ్యాపారలను ఇక నుంచి నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చేపట్టనుంది.
ఈ విలీనం రెండు కంపెనీ ఆస్తులు(Assets),కార్యకలాపాలు(Operations), బ్రాండ్(Brand) గుర్తింపులను ఒకే బ్యాకింగ్ కంపెనీగా ఏకీకృతం చేస్తుందని స్లైస్ తెలిపింది. ఈ విలీనం తర్వాత ఏర్పడిన కొత్త సంస్థ ఈశాన్య ప్రాంతంలో(North East Region) బ్యాంక్ ఉనికిని మరింతగా పెంచుతుందని, భారతదేశం మొత్తం తమ బిజినెస్ ను విస్తరించేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని తెలిపింది. అలాగే మరింత టెక్నాలజీతో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తమ సంస్థ సహకరిస్తుందని తెలిపారు. ఈ విలీనం తర్వాత ఏర్పడిన సంస్థతో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్లైస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రాజన్ బజాజ్(Rajan Bajaj) అన్నారు.