- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి క్లైమాక్స్‌తో ఇప్పటివరకు ఎలాంటి మూవీ రాలేదు.. ‘క’పై హైప్ పెంచేస్తున్న హీరో
దిశ, సినిమా: టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ (Periodic Thriller) చిత్రం ‘క’. ఇందులో నయన్ సారిక (Nayan Sarika), తన్వీ రామ్ (Tanvi Ram) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ (back drop)లో తెరకెక్కతున్న ఈ చిత్రానికి సుజీత్ (Sujeet), సందీప్ (Sandeep) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీమతి చింతా వరలక్ష్మి (Chinta Varalakshmi) సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. దీపావళి (Diwali) స్పెషల్‌గా ఈ నెల 31న రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
‘మా ‘క’ సినిమాకు మీడియా నుంచి మంచి సపోర్ట్ (Support) వస్తోంది. అందుకు మీ అందరికీ థ్యాంక్స్ (thanks). దర్శకులు సందీప్, సుజీత్ ఈ కథ చెప్పినప్పుడు నెక్ట్స్ (Next) ఏం జరుగుతుంది అనేది ఊహించలేకపోయాను. నేను ఇలా జరుగుతుందేమో అనుకుంటే మరో ట్విస్ట్ (twist) వచ్చింది. ఇలాంటి పాయింట్‌తో 70వ దశకం నేపథ్యంలో కొత్తగా మూవీ ప్లాన్ (plan) చేసుకోవచ్చు అనే ఫీలింగ్ (feeling) కలిగింది. దర్శకులు చెప్పిన షాట్ మేకింగ్ (shot making) కూడా కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు ఈ కథను తప్పకుండా బాగా రిసీవ్ (receive) చేసుకుంటారని నమ్మాం. మూవీ క్లైమాక్స్ (Climax)ను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాం. ఇలాంటి క్లైమాక్స్‌తో ఇంతవరకు మూవీ రాలేదు. అందుకే కొత్తదనం మీరు ఫీల్ కాకుంటే నేను సినిమాలు చేయను అనే బోల్డ్ స్టేట్‌మెంట్ (bold statement) ఇచ్చాను. చాలామంది కాంతార, విరూపాక్ష మూవీస్‌తో క సినిమాను పోలుస్తున్నారు. కానీ అలా ఏమాత్రం ఉండదు. ఇదంతా సైకలాజికల్‌గా వెళ్తుంది. డివోషనల్ పాయింట్స్ ఉండవు. ఎవరు ఏంటి ఎక్కడ అనే సస్పెన్స్‌తో మూవీ సాగుతోంది. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.