- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత, కొత్త రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం!
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవాటితో పాటు పాతకార్డుల స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. గతంలో ఉన్న కార్డులు, కొత్తగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లపై ఎన్నికల కోడ్ ముగియగానే నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో 89,98,546 రేషన్ కార్డులు ఉండగా.. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఓ బుక్ మాదిరిగా ఉండేది. అనంతరం రైతుబంధు పాస్‌బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ చేశారు. వీటిలో ముందు వైపు ఫ్యామిలీ మెంబర్స్ ఫొటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరిచారు. వెనకవైపు అడ్రస్, ఇతర వివరాలు మెన్షన్ చేశారు. తర్వాత రేషన్ కార్డుల ప్లేస్‌లో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఈ కార్డులో యజమాని, ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోలు లేకుండా కార్డు హోల్డర్, ఫ్యామిలీ మెంబర్స్, రేషన్ షాప్, కార్డు నంబర్ మాత్రమే ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొత్తవారికి రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉన్నందున పాత లబ్ధిదారులను కలుపుకుని కొత్తరూపంలో కార్డులను తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికల కోడ్ ముగిశాక దీనిపై కసరత్తు స్టార్ట్ కానున్నట్లు సమాచారం.
20 లక్షల కొత్త దరఖాస్తులు..
తెలంగాణలో కొత్తరేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే కీలకంగా మారడంతో గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు లేని అర్హులంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక గతేడాది డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు ‘ప్రజాపాలన-అభయహస్తం’ పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు రాగా ఇందులో ఐదు గ్యారంటీల కోసం 1,05,91,363 అప్లికేషన్లు, రేషన్ కార్డు వంటి ఇతర అవసరాల కోసం 19,92,747 అప్లికేషన్లు వచ్చాయి. వీటన్నింటిని స్వీకరించిన అధికారులు ఆయా స్కీమ్‌ల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త మిగతా స్కీమ్‌లకు రేషన్ కార్డు కీలకం కావడంతో తొలుత రేషన్ కార్డులను జారీ చేసే విషయంలో సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.