కేసీఆర్ ఇగ ఎట్ల రావాలే మీకు బుద్ధి?! కాంగ్రెస్ సంచలన ట్వీట్

by Ramesh N |   ( Updated:2024-03-06 15:43:00.0  )
కేసీఆర్ ఇగ ఎట్ల రావాలే మీకు బుద్ధి?!  కాంగ్రెస్ సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ ఇగ ఎట్ల రావాలే మీకు బుద్ధి..? అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన ట్వీట్ చేసింది. మేడిగడ్డ డిజైన్, నాణ్యత, నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు, యావత్ మీడియా, ఇంజనీరింగ్ నిపుణులు అంతా ముక్త కంఠంతో మొత్తుకుంటున్నా.. బీఆర్ఎస్ స్వయం ప్రకటిత మేధావులు మాత్రం అదో అద్భుతం అంటున్నారని పేర్కొంది.

‘కేసీఆర్ ఇగ ఎట్ల రావాలే మీకు బుద్ధి?! ఊంచితే ఊంచిరి మాకేం అన్నట్టు.. నిస్సిగ్గుగా వ్యవహరించడం బీఆర్ఎస్ కే సాధ్యం. యావత్ తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. ఇలాంటి దొంగల ముఠాకా ఇన్నేళ్లు మేం అధికారం అప్పజెప్పిందని. తెలంగాణ ప్రజలని నిర్బంధించి, మీ బానిసలుగా చూశారు. ఈ పాపం ఊరికే పోదు. తస్మాత్ జాగ్రత్త’ అని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed