- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Etala Rajender: ఆ మాట ఒక్కరు చెప్పినా రాజకీయాల నుంచి తప్పుకుండా
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి టీ.బీజేపీ కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) సవాల్ విసిరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కూలగొడుతున్న దగ్గరికి ఇద్దరం సెక్యూరిటీ లేకుండా వెళ్దామా అని ప్రశ్నించారు. ‘శభాష్ రేవంత్’ అని ఎవరైనా అంటే అక్కడే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తా అని అన్నారు. పేదలను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించడం బాధాకరమైన విషయం అని అన్నారు. మూసీ ప్రక్షాళన రోడ్ మ్యాప్ ఏంటి.? డీపీఆర్ ఏంటి? అని ఈటల రాజేందర్ అడిగారు.
అంతకుముందు ధర్నాచౌక్‌లో దీక్ష చేస్తున్న ట్రిపుల్ భూనిర్వాసితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఈటల మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు ప్రధానమైన నాలుగు రహదారులు విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూ నిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. పేద రైతుల స్థలాలను గుంజుకుని రైతులను బిచ్చగాళ్లను చేస్తానంటే ఎవరు ఊరుకోరని ఆయన హెచ్చరించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు.
👉 Also Read: Eatala Rajendar: ఫోర్త్ సిటీలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్నది ఇదే.. ఈటల సెన్సేషనల్ కామెంట్స్