ఎస్.జె సూర్య, యోగిబాబుపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

by sudharani |
ఎస్.జె సూర్య, యోగిబాబుపై పవన్ కల్యాణ్ ప్రశంసలు
X

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల తమిళనాడు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం ఎస్.జె సూర్య, యోగిబాబుపై ప్రశంసలు కురిపించారు. వాళ్ల నటన నాకెంతో ఇష్టమని తెలిపారు. ఈ మేరకు ఎస్.జె సూర్య, యోగిబాబు పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై స్పందిస్తూ.. ‘నాపై ప్రశంసలు కురిపించి, నన్ను ఎంతగానో ప్రోత్సహించినందుకు ఏపీ డిప్యూటీ సీఎంకు థాంక్యూ’ అంటూ ట్వీట్స్ పెట్టారు. ఈ ట్వీట్స్‌పై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ‘థాంర్యూ ఎస్.జె సూర్య. మీతో కలిసి వర్క్ చేయడం నాకు గొప్ప అనుభూతిని అందించింది.

యాక్టింగ్, దర్శకత్వంలోనే కాకుండా వివిధ విభాగాలపై మీకున్న అసాధారణ ప్రతిభ నిజంగా స్ఫూర్తిదాయకం. సరిపోదా శనివారంతో ఘన విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్. భవిష్యత్తులో మీరు నటించిన మరెన్నో చిత్రాలు ఇదే విధమైన విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ తెలిపారు. అలాగే యోగిబాబు గురించి మాట్లాడుతూ.. ‘థాంక్యూ యోగిబాబు.. మీ హాస్యచతురత, యాక్టింగ్ స్కిల్స్ నిజంగా ప్రశంసనీయం. వివిధ పాత్రల్లో మీరు కనిపించే విధానం ప్రత్యేక ఆకర్షనను అందిస్తుంది. ‘మండేలా’లో మీ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. భవిష్యత్తులో మీరు చేయనున్న ప్రాజెక్టులు అన్నింటికీ నా బెస్ట్ విషెస్’ అంటూ ఇద్దరి ట్వీట్స్‌కు రిప్లై ఇచ్చారు పవన్ కల్యాణ్.

Next Story