సమంత-నాగ చైతన్య విడాకులపై కొండా సురేఖ మరోసారి హాట్ కామెంట్స్ (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-03 17:58:23.0  )
సమంత-నాగ చైతన్య విడాకులపై కొండా సురేఖ మరోసారి హాట్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగ చైతన్య - సమంత(Samantha-Naga Chaitanya) విడాకులపై మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘వాళ్ల విడాకులపై నేను చేసిన వ్యాఖ్యలు తప్పే కావచ్చు. మరి వారి విడాకులకు కారణం ఏంటో ఇంతవరకు ఎందుకు బయటకు చెప్పలేదు. నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ, సమంత నుంచి ఎవరూ రీజన్ ఏంటో చెప్పలేదు. తమకు ఇండస్ట్రీ నుంచి ఇంటర్నల్‌గా వచ్చిన సమాచారాన్నే నేను చెప్పాను. ఆ మాటలు కూడా నేను కోపంలో అన్నాను. నేను వాస్తవాలే మాట్లాడుతా. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడటం నాకు రాదు. కేటీఆర్‌ను వదలను. మళ్లీ ఇదే రిపీట్ అయితే కేటీఆర్‌ను హైదరాబాద్‌లోనే కాదు.. జిల్లాల్లోనూ తిరగనివ్వం’ అని కొండా సురేఖ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

Read More...

హీరోయిన్ త్రిషపైనా ఇలాంటి ఆరోపణలు చేశారు.. సమంత ఇష్యూపై నటి రియాక్షన్



Advertisement

Next Story