రాజకీయాలు దిగజారకూడదు.. కొండా సురేఖ వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ రియాక్షన్

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-03 15:28:48.0  )
రాజకీయాలు దిగజారకూడదు.. కొండా సురేఖ వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కుటుంబం, నటి సమంత(Samantha)పై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘నేటి రాజకీయ నాయకుల ప్రవర్తనపై నా ఆలోచనలు, భావాలను మంచి భాషలో వక్తీకరించడానికి ఇబ్బంది పడుతున్నాను. ప్రజలకు మంచి చేస్తారనే భావించాకే మేము ఓటు వేసి గెలిపిస్తాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను మేము అంగీకరించలేము. రాజకీయాలు ఏమాత్రం దిగజారకూడదు’ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టోరీ పెట్టారు. కాగా, ఇప్పటికే తన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ‘ఏ విషయంలో నేను బాధపడ్డానో.. ఆ విషయంలో మరొకరిని నొప్పించానని తెలిసి వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నాను. నేను పడిన బాధ వేరేవాళ్లు పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. అప్పుడే దీనిపై స్పందిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశాను’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.

Read More...

కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్





Advertisement

Next Story

Most Viewed