బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దేవర.. పవర్ ఫుల్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్

by sudharani |
బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దేవర.. పవర్ ఫుల్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. మొదటి షో నుంచి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. కలెక్షన్లు మాత్రం భారీగానే రాబడుతోంది. అంతే కాకుండా తాజాగా దేవర రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరినట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. ఇక నిన్నటితో ఆరు రోజులు పూర్తి చేసుకున్న క్రమంలో ఈ కలెక్షన్లు రూ. 396 కోట్లకు చేరినట్లు మరో పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. మొత్తంగా ఎన్టీఆర్ ‘దేవర’ కలెక్షన్ల పరంగా సూనామీ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఘన విజయం సాధించిన క్రమంలోనే బ్లాక్ బస్టర్ ప్రోమోను రిలజ్ చేశారు. ఇందులో ‘దేవర’ సినిమాలో హైలైట్ అయినా సీన్స్ అన్ని కవర్ కావడంతో.. ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.

Next Story

Most Viewed