తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ IPS ఆఫీసర్ జితేందర్

by Satheesh |
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ IPS ఆఫీసర్ జితేందర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్ బాధ్యతలు స్వీకరించారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్‌ను తెలంగాణ ప్రభుత్వం డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ డీజీపీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జితేందర్‌కు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ.. డీజీపీగా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నార్కోటిక్స్, సైబర్ క్రైమ్‌పై ఎక్కువ ఫోకస్ పెడతామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.

కాగా, పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన జితేందర్ 1992 కేడర్ ఐపీఎస్ ఆఫీసర్. తొలుత ఏపీ కేడర్‌లో పని చేసిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ‌కు అలాట్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా పనిచేసిన జితేందర్.. మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగానూ పని చేశారు. అనంతరం డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ఆయన సీబీఐ, గ్రేహౌండ్స్‌లో వివిధ హోదాల్లో వర్క్ చేశారు. అనంతరం డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్, వరంగల్ డీఐజీగా పనిచేశారు. తర్వాత సీఐడీ, విజిలెన్స్‌లో వర్క్ చేయడంతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్ అదనపు డీజీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన జితేందర్.. ప్రస్తుతం డీజీపీ హోదాలో హోం శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా ఆయనను డీజీపీగా నియమించింది.

Advertisement

Next Story

Most Viewed