- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థాక్రేజీ.. టీ- కాంగ్రెస్ నేతలకు ఫస్ట్ ఆ లొల్లి ఆపమని చెప్పండి: CM పోస్ట్‌పై వీహెచ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీ కాంగ్రెస్‌లో ఇటీవల సీఎం పోస్ట్‌పై జోరుగా చర్చ మొదలైంది. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరూ అన్న దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో అప్పుడే షూరు అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరికి వారే సీఎం సీటుపై ఆశలు పెట్టుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా సీఎం పోస్ట్‌పై మనసులోని మాట బయటపెడుతున్నారు. ఈ క్రమంలో సీఎం పోస్ట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది.
ఈ సభకు హాజరైన వీహెచ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే నేనే సీఎం అంటున్నారు.. ఫస్ట్ నేనే సీఎం అనడం కాంగ్రెస్ లీడర్లు మానేయాలని సూచించారు. థాక్రేజీ.. నేతలందరికీ ఈ సీఎం గోల ఆపమని చెప్పండి అని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరూ అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వీహెచ్ స్పష్టం చేశారు. నాకు కూడా గతంలో సీఎం అయ్యే అవకాశం వచ్చి పోయిందని గుర్తు చేశారు. ముందు ఎన్నికల్లో గెలవండి.. ఆ తర్వాత సీఎం పంచాయతీ అని నేతలకు సూచించారు.