- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిక్కుల్లో రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రలో వివాదాస్పద వ్యక్తితో భేటీ!
దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ జోడో యాత్ర చేపట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు చేస్తున్న పాదయాత్రలో ఆయన ఓ వ్యక్తిని కలవటం దుమారం రేపింది. రాహుల్ గాంధీ చర్యపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కన్యాకుమారిలో కొనసాగుతున్న పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ వివాదాస్పద తమిళ క్రైస్తవ పాస్టర్ జార్జ్ పొన్నయ్యను కలిశారు. శుక్రవారం ఉదయం విరామ సమయంలో క్యాంప్ చేసిన పులియూర్‌కురిచి ముట్టిడిచన్ పరై చర్చిలో కొంతమంది క్రైస్తవ పెద్దలను రాహుల్ కలిశారు. ఈ సమావేశంలో జార్జ్ పొన్నయ్య కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంభాషించిన వీడియో క్లిప్‌పై దుమారం చెలరేగింది. ఇందులో రాహుల్ గాంధీ 'యేసుక్రీస్తు భగవంతుని రూపమా? అది సరైనదేనా?' అని అడగగా దానికి జార్జ్ పొన్నయ్య.. 'అతను నిజమైన దేవుడు' అలాగే 'అతడు ఏదో శక్తిలాగా కాదు' అంటూ బదులిచ్చాడు. ఈ వీడియో క్లిప్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చరిత్ర పొన్నయ్యకు ఉంది. గతేడాది జులైలో మధులైలోని కుల్లికుడిలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, డీఎంకే మంత్రిపై ద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై పొన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రాహుల్ గాంధీని కలిసిన జార్జ్ పొన్నయ్య 'జీసస్ శక్తిలా కాదని ఏసు ఒక్కడే దేవుడు' అన్న పొన్నయ్య వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షేహజాబ్ పూనావాలా మండిపడ్డారు. పొన్నయ్యతో రాహుల్ గాంధీ భేటీ కావడం చూస్తుంటే ఇది భారత్ జోడో యాత్ర కాదని భారత్ టోడో యాత్ర అని విరుచుకుపడ్డారు. అయితే, రాహుల్ గాంధీ చేపట్టిన పాదయత్రకు అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్న క్రమంలో ఇలాంటి వివాదాస్పద వ్యక్తులతో భేటీ కావటం పార్టీ ప్రతిష్టకు మరింత మచ్చ తెస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : టాప్ సీక్రెట్ బయటపెట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత
Also Read : కృష్ణారెడ్డి, స్రవంతిలతో రేవంత్ భేటీ