Indrasena Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-27 10:51:55.0  )
Indrasena Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి(Indrasena Reddy) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ప్రకటించారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి(Indrasena Reddy)కి ఇందిరా గాంధీ(Indira Gandhi) కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యువజన కాంగ్రెస్(Youth Congress) జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా, ఇంద్రసేనా రెడ్డి మరణవార్త తెలిసిన కాంగ్రెస్ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతున్నారు.




Advertisement

Next Story

Most Viewed