- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Seethakka: డీపీఓలతో మంత్రి సీతక్క సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యక్తిగతంగా ఎంత సున్నితంగా ఉంటానో.. విధుల పట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తానని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఎర్రమంజిల్ లోని గ్రామీణ మంచినీటి సరఫరా కేంద్ర కార్యాలయంలో మంత్రి సీతక్క, ఆ శాఖ కార్యదర్శి, లోకేష్ కుమార్, డైరెక్టర్ శ్రీజనతో కలిసి, జిల్లా పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మూడున్నర గంటల పాటు సాగిన సమావేశంలో అన్ని జిల్లాల డీపీఓల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకున్నారు. గ్రామాల్లో నిధుల వినియోగం, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, పనుల పురోగతి, పచ్చదనం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసి అన్ని పనుల్లో వేగాన్ని పెంచాలన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అధికారులు పంచాయతీరాజ్ శాఖకు వన్నె తెచ్చే విధంగా గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.
మనదేశంలో గ్రామాల్లోనే ఎక్కువ శాతం ప్రజలు నివసిస్తున్నారని, పల్లెల అభివృద్ధి పై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. పల్లెలను ప్రగతి పథంలో నిలిపేలా డీపీఓ లు పనిచేయాలని కోరారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనం, గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు సురక్షిత మంచి నీరు సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, కాలనీలు, ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా అవుతున్న తాగు నీటి విషయంలో ఎప్పటికప్పడు నాణ్యత పరీక్షలను నిర్వహించాలని సూచించారు.పాఠశాలలు తెరిచే లోపు తాగు నీటి సరఫరా పూర్తవుతున్నందున..తాగు నీటి సరఫరా ఇతర సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు హెడ్ మాస్టర్, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో వ్యవహరించి ఉదయమే ట్యాంకులను నింపేందుకు సమగ్రమైన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఆయా జిల్లాలో ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టి ప్రణాళికలను రూపొందించుకుని ఆచరణలో పెట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు అందరూ గర్వపడాలని, ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా ప్రజలకు సేవలను అందించాలన్నారు. మనం చేసే పనిలో మానవత్వ కోణాన్ని జోడించి అధికారులు పని చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. కొన్ని జిల్లాలో అనుకున్నంత మేర పనులు ముందుకు సాగడం లేదని పొరపాట్లను సరిద్దుకుని పనుల్లో వేగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహకారం ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. అదే సమయంలో అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పీఆర్, ఆర్డీ శాఖలో 2017 నుంచి పెండింగ్ లో ఉన్న కారుణ్య నియమాకాల ఫైల్ క్లియర్ చేయించామని, డీపీఓల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీతక్క వెల్లడించారు. ఇక నుంచి ప్రతి నెల డీపీఓలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. తమ కింది స్థాయి ఉద్యోగులతో 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పీఆర్, ఆర్డీ శాఖను తాను కుటుంబంగా భావిస్తానని..గ్రామీణ ప్రజల జీవితాలతో పెనవేసుకున్న ఈ శాఖలకు మంత్రిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తానని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
అట్టడుగు వర్గాలకు సామర్థ్యం ఉందని నిరూపించాలి
అట్టడుగు వర్గాలకు సామర్థ్యం ఉండదనే దురాభిప్రాయం సమాజంలో ఉందని, ఆ అభిప్రాయాన్ని పొగొట్టేలా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీ రాజ్ శాఖను సొంత కుటుంబంలా భావించి అధికారులు పని చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయి పర్యటనలను పెంచి శాఖపై సొంత ముద్ర ఉండేలా ప్రత్యేకతను చాటుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛదనం పచ్చదనం, పనుల జాతరను విజయవంతం చేసినందుకు..సీఎం రెవంత్ రెడ్డి అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. . వచ్చే వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు లేకుండా యాక్షన్ ప్లాన్ ను వేగవంతం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో సఫాయి కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్ల దే కీలక పాత్ర అని, వారికి ప్రతి నెల ఐదో తేదీ లోపు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీల ద్వారా కాకుండా నేరుగా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచే ఏకకాలంలో జీతాలు చెల్లించే విధానాన్ని అవలంభిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఇక పీఆర్, ఆర్డీ శాఖ కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్చదనం, పచ్చదనం పెంపొందించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. గ్రామాల్లో రోడ్ల వెంట మురుగు నీరు పారితే సంబంధిత పంచాయతీ కార్యదర్శులను బాధ్యులుగా చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో చెత్త సేకరణ పక్కాగా జరగాలని, తడిచెత్త పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని అవలంబించాలని కోరారు. స్థానిక ఎన్నికల షెడ్యుల్ త్వరలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. అనంతరం కమిషనర్ శ్రీజన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు మొదలుకుని డీపీఓల వరకు అంతా సమయ పాలన పాటించి..పనితీరును మెరుగు పరుచుకోవాలని సూచించారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేలా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం డీపీఓలు మంత్రి సీతక్కను సన్మానించారు.