- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Secretariat : సెక్రటేరియట్ బందోబస్తు సెక్యూరిటీ మార్పు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వహించే బందోబస్తు సెక్యూరిటీ మార్పులు జరిగాయి. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ భద్రత బాధ్యతలను (టీజీఎస్పీ) ప్రత్యేక పోలీస్ విభాగం స్థానం నుంచి టీజీఎస్పీఎఫ్‌కు అప్పగించింది. కాగా, బెటాలియన్ కానిస్టేబుళ్లు నిరసనలు, ధర్నాల కారణంగా ఇంటెలిజెన్స్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో కూడా తాజాగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. సీఎం నివాసం వద్ద ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
అదేవిధంగా తెలంగాణ సచివాలయం చుట్టూ దాదాపు రెండు కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సచివాలయం స్టాఫ్ కదలికలు, సోషల్ మీడియాపై అధికారులు నిఘా పెట్టారు. ప్రభుత్వం, పోలీసు శాఖకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు షేర్, లైక్ చేయొద్దని సూచించారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ కావాలని సిబ్బందిని ఆదేశించారు. తప్పు జరిగితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఇటీవల హెచ్చరించారు. కాగా, తమ సమస్యలు పరిష్కరించాలంటూ టీజీఎస్పీ పోలీసులు కుటుంబసభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం విదితమే. దీంతో సెక్యూరిటీ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.