- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సభ పార్కింగ్ కోసం పాఠశాల బంద్..
దిశ, వికారాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నాడని పోలీస్ బందోబస్తు లో భాగంగా అందుకు కావాల్సిన పార్కింగ్ కోసం పాఠశాలనే బంద్ చేసిన పరిస్థితి వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయం పరిధిలో ఉన్న బృంగి ఇంటర్నేషనల్ ప్రముఖ పాఠశాలలో పోలీస్ శాఖ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని కారణంగా పాఠశాల యాజమాన్యం ఈ రోజు మొత్తం పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే పాఠశాల బంద్ చేస్తారా..? అసలే కరోనా సమయంలో పిల్లలు సరిగ్గా చదవక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ సెలవులు కాకుండా, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి బందోబస్తు కోసం సెలవు ప్రకటించి మరి అంత పెద్ద ప్రోగ్రాం చేయడం ఎందుకని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బహిరంగ సభకు జనాన్ని సమకూర్చడంలో భాగంగా, కొన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులను కూడా బుక్ చేశారని, దీని కారణంగా ఆయా పాఠశాలలకు సైతం సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది.