బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు BIG షాక్.. SC, ST అట్రాసిటీ కేసు నమోదు

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-18 10:56:50.0  )
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు BIG షాక్.. SC, ST అట్రాసిటీ కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్/చైతన్య పురి: బీఆర్ఎస్(BRS) కీలక నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే(LB Nagar MLA) దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(Devireddy Sudheer Reddy)కి భారీ షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు(SC, ST Atrocity Case) నమోదైంది. తనపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత(Corporator Banothu Sujatha) ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. కాగా, ఇటీవల ఎల్బీనగర్‌లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రొటోకాల్ గొడవ జరిగింది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాజాగా మరోసారి నిన్న సోమవారం రోజున అవే పనులకు మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి శంకుస్థాపన చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

ఎమ్మెల్యే శంకుస్థాపన చేశాక.. మళ్లీ కార్పొరేటర్ ఎలా చేస్తారని బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే.. స్టేషన్‌కు వచ్చి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కార్పొరేటర్(BJP Corporator) కొప్పుల నర్సింహారెడ్డి, హస్తినాపురం కార్పొరేటర్‌ సుజాత నాయక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేటర్ సుజాత.. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు(SC, ST Atrocity Case) నమోదు చేయాలని ఎల్బీ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.


Read More..

అవి అందాల్సింది నాకు కాదు.. రాహుల్ గాంధీకి.. CM రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Congress: కేసీఆర్ మాకు ఎక్కడా అన్యాయం చేయలేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

Next Story