Harish Rao : గురుకుల విద్యార్థుల ప్రాణాలు కాపాడండి : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : గురుకుల విద్యార్థుల ప్రాణాలు కాపాడండి : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యాశాఖ(Education Department)ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలకడం మాని గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, సరైన విద్యాబోధన జరిగేలా చేసి..అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కాపాడండని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో పాము కాటుకు గురై మరో గురుకుల విద్యార్థి ఆసుపత్రి పాలైన వార్త తీవ్రంగా కలిచివేసిందని ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరుతుండడం సిగ్గుచేటన్నారు. గురుకులాల్లో కుక్కకాట్లు, ఎలుక కాట్లు, పాము కాట్లు సాధారణంగా మారడం దురదృష్టకరమన్నారు.

విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు తన వద్దనే ఉన్నా ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేయడని, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలని మండిపడ్డారు. పురుగులన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా పట్టించుకోడని, ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలైన పట్టించుకోడని, టీచర్లు కావాలంటూ విద్యార్థులు రోడ్డెక్కినా పట్టించుకోడని విమర్శించారు. పాముకాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులతో ఆసుపత్రుల పాలైనా పట్టించుకోడని, మీ 11నెలల కాలంలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోడని రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed