- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Revanth:వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ రోజు(బుధవారం) ఉదయం సీఎం రేవంత్ రెడ్డి హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులు సీఎం రేవంత్ వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేములవాడ నియోజకవర్గం పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ. 76 కోట్ల పనులకు, రూ 47.85 కోట్లతో మూలవాగు బ్రిడ్జి నుంచి రోడ్ల వెడల్పు నకు సంబంధించిన పనులు మూల వాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ వరకు మురికి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ. 50 కోట్లతో యారన్ డిపోను ప్రారంభిస్తారు. సిరిసిల్లలో రూ 26 కోట్లతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయం భవనం, వేములవాడలో రూ 1.45 కోట్లతో నిర్మించిన గ్రంథాల భవనం, రూ 4.80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్నా రు. దీంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.