C-DAC Recruitment: చెన్నైలోని సీడాక్ లో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత తదితర వివరాలివే..!

by Maddikunta Saikiran |
C-DAC Recruitment: చెన్నైలోని సీడాక్ లో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత తదితర వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మీరు బీటెక్/ఎంటెక్ పాసై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. చెన్నై(Chennai)లోని సెంటర్ ఫర్ డెవలప్​మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్(C-DAC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 125 పోస్టులను కాంట్రక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.cdac.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 5 డిసెంబర్ 2024. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు చెన్నై, ఢిల్లీ, ముంబై, కొచ్చి, గోవా, లక్ష ద్వీప్, పోర్ట్ బ్లెయిర్, వైజాగ్, భోపాల్ నగరాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

పోస్టు పేరు, ఖాళీలు :

  • ప్రాజెక్ట్ అసోసియేట్ - 30
  • ప్రాజెక్ట్ ఇంజినీర్ - 50
  • ప్రాజెక్ట్ మేనేజర్ - 05
  • ప్రాజెక్ట్ టెక్నీషియన్ - 20
  • సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ - 20

విద్యార్హత:

పోస్టును బట్టి బీఈ/ బీటెక్‌/ఎంఈ/ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సడలింపులు ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

ఈ పరీక్షకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. అభ్యర్థులు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.

Advertisement

Next Story