టీచర్ గా మారిన సర్పంచ్.. ఎక్కడో తెలుసా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-04 08:11:36.0  )
టీచర్ గా మారిన సర్పంచ్.. ఎక్కడో తెలుసా?
X

దిశ, మణుగూరు : పంచాయతీ పాలనపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మణుగూరు ఎక్స్‌లెంట్ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠ్యాంశంలో ఉన్న విషయాలను నేరుగా పంచాయతీ సర్పంచ్, అధికారుల ద్వారా విద్యార్థులకు తెలియజేయాలనే సంకల్పంతో సమితి సింగారం పంచాయతీ కార్యాలయంలో జరిగే పరిపాలన విధానాన్ని సర్పంచ్ బచ్చల భారతి ద్వారా అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, వీధి దీపాలు, ఇంటిపన్నులతో పాటు ఏ విధంగా పంచాయతీని పరిపాలించాలి. ఎంతమంది సిబ్బంది వుండాలి.

ప్రభుత్వం నుండి నిధులు ఎలా వస్తాయి. ఏ విధంగా అభివృద్ధి చేయాలి. ఇలా అనేక విషయాలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ద్వారా విద్యార్థులు తెలుసుకున్నారు. పంచాయతీ పరిపాలన అనే పాఠాన్ని బోధించిన సర్పంచ్ ఒక్కరోజు టీచర్ అయ్యారు. పంచాయతీ పరిపాలనా విధానాన్ని విశదీకరించిన సర్పంచ్, కార్యదర్శిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పంచాయతీ పరిపాలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో టీచర్లు ఉష, మానసలతో పాటు ఎక్స్‌లెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story