ఆగస్టు 15న రైతు రుణ మాఫీ పక్కా: సామా రామ్మోహన్ రెడ్డి

by Satheesh |
ఆగస్టు 15న రైతు రుణ మాఫీ పక్కా: సామా రామ్మోహన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి అని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ పక్కా అంటూ ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ, కిషన్ రెడ్డి అబద్దాలకు లెక్కే లేదన్నారు. ఒక్కో రాష్ట్రానికి వెళ్లి, ఒక్కోలా మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారు..? అంటూ ప్రశ్నించారు. విభజన హామీలేమయ్యాయి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు జిల్లాలకు నష్ట పరిహారంపై మోడీ ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖ రాసినా మౌనం వహించారన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నా, రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదన్నారు.

వరదలు, కరువు వచ్చినా, కిషన్ రెడ్డి నోరు మెదిపే పరిస్థితి లేదన్నారు. అచ్చే దిన్ అంటూ పదేళ్లలో ప్రజలకు సచ్చే దిన్‌ను తీసుకువచ్చారంటూ చురకలు అంటించారు. నిత్యావసర వస్తువులు ధరలు పెంచేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అవినీతి పరులను జైళ్లో వేస్తమని దొంగ మాటలు చెప్పి, పన్ను ఎగవేతదారులను దేశాలు దాటిస్తున్నారని ఆరోపించారు. నల్లధనం పేదల అకౌంట్లో వేస్తామని ప్రకటించి మోసం చేశారన్నారు. స్విస్ బ్యాంక్ లలో నల్లధనం నాలుగు రెట్లు రెట్టింపుతో డిపాజిట్ అవుతున్నా, మోడీ ప్రభుత్వం కళ్లు తేలేసిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేకంగా ఏమీ చేయలేదన్నారు.

వివిధ రకాల పన్నుల రూపంలో తెలంగాణ కేంద్రానికి రూపాయి చెల్లిస్తే, బిచ్చం ఇచ్చినట్లు కేవలం 43 పైసల రిటర్న్ ఇస్తున్నారన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ను ఇప్పటి వరకు ప్రకటించలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా అందడం లేదన్నారు. ఇక 811 టీఎంసీ కృష్ణ జలాలలో సరైన వాటా ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఐఐటీ, మెడికల్ కాలేజీలను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్” అంటూ ఇచ్చిన హామీలకు పంగనామం పెట్టారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి పనిచేశాయని, ఫలితాలు తర్వాత బీఆర్ఎస్ ఇక కనిపించదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story