- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలోనే RTC కార్మికులకు భారీ గుడ్ న్యూస్..? మే డే వేళ KCR కీలక ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెరగనున్నాయి. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచాలని నిర్ణయించామని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖనును సీఎం ఆదేశించారు. దీంతో సాధ్యసాధ్యాలపై ఆర్టీసీ కసరత్తు చేస్తోన్నది. సర్కార్ జీతాలు పెంచితే ఆర్టీసీ లోని అన్ని విభాగాలు సుమారు 45 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది.
దీంతో ఆర్టీసీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇక మే డే కానుకగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా వెయ్యి రూపాయల చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్‌తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ పెరగనున్నాయి.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘‘తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వీరి కృషి దాగి ఉన్నది. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నది. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడింది.తద్వారా పారిశుధ్ద్య కార్మికులు కూడా అదే కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు”అంటూ సీఎం కేసీఆర్అభినందనలు తెలిపారు.