- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయి సింధు ట్రస్ట్ నిర్మాణాలను ఆపాలి : కాంగ్రెస్ నేత బక్క జడ్సన్
దిశ, తెలంగాణ బ్యూరో: హై కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత చైర్మన్ పార్థసారథిరెడ్డికి చెందిన సాయి సింధు ట్రస్ట్ కొనసాగిస్తున్న నిర్మాణాలను ఆపాలని కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలోని సర్వే నెంబర్ 41లో హైటెక్ సిటీ సమీపంలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ట్రస్టుకు 60 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ప్రభుత్వం 2018లో జీవో నంబర్ 59 జారీ చేసిందన్నారు.
ఈ జీవోను సవాల్ చేస్తూ డాక్టర్ ఊర్మిళ పింగ్లే, కె.సురేశ్‌కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారని చెప్పారు. ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 31న తీర్పు రిజర్వు చేసిందన్నారు. సోమవారం ఆ తీర్పును వెలువరించిందని, ఆయన మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ట్రస్టుకు భూమిని కేటాయిస్తూ ఇచ్చిన జీవో 59ని హైకోర్టు కొట్టేసిన.. బుర్ర ఉపయోగించకుండా ఆ జీవో ఇచ్చారని విమర్శించారు. పాలసీకి విరుద్ధంగా కేటాయింపు చెల్లదని కోర్టు స్పష్టీకరణ ఇచ్చిందని తెలిపారు.
పాలసీ ప్రకారం మళ్లీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు. అక్కడ నిర్మాణాలు మొదలుపెట్టేసినంత మాత్రాన అక్రమ కేటాయింపులు చట్టబద్ధం అయిపోవు అని, హై కోర్ట్ తీర్పు ఇచ్చిన తర్వాత చైర్మన్ పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ట్రస్టు కొనసాగిస్తున్న నిర్మాణాలను ఆపాలని నిర్మాణం చేసేవారిని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ‘టీడీఆర్’లను థర్డ్ పార్టీలకు పునఃవిక్రయం చేయడంపై విచారణ చేయవలసిందిగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీకి మంగళవారం బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు ఉన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు టీడీఆర్ అమ్మకం, కొనుగోలు స్కాం చేస్తున్నారని తెలిపారు. మోసపూరిత వ్యక్తుల నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలకు టీడీఆర్‌లను విక్రయించడం, కొనుగోలు చేయడం రూ.1500 కోట్ల కుంభకోణంలో అంచనా వేయబడిందన్నారు. అందుచేత జీహెచ్ఎంసీ, స్థానిక మునిసిపాలిటీలు జారీ చేసే ప్రతి టీడీఆర్ విక్రయదారుడు ఎవరు, కొనుగోలుదారు ఎవరు? వారికి ఎలాంటి సంబంధం ఉంది అనే లక్ష్యంతో జారీ చేసిన ప్రతి టీడీఆర్ విక్రయంపై వివరణాత్మక విచారణ జరిపి, ఈ అపకీర్తి లావాదేవీలకు పాల్పడిన వారిని బుక్ చేయవలసిందిగా విజిలెన్స్ డీజీని కోరారు.