- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sabitha Indra Reddy: తెలంగాణ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కానిస్టేబుళ్ల(TSSP Constables) కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ రెడ్డే(CM Revanth Reddy) కారణమని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు. శనివారం తెలంగాణ భవన్(Telangana Bhavan) వేదికగా ఆమె మీడియాతో మాట్లాడారు. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ రెడ్డి ఫెయిల్ అవ్వటం వల్లనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరమని తెలిపారు. పోలీసులు రోడ్డు ఎక్కడం చరిత్రలోనే మెదటసారి అని వెల్లడించారు. ప్రజా పాలన(Praja Palana) అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి(Revanth Reddy)? అని ప్రశ్నించారు.
హోంమంత్రి(Home Minister) లేకపోవటం వలన.. కానిస్టేబుల్స్(Constables) తమ బాధ ఎవరకి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. యూనిఫాం వేసుకుని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చిందని మండిపడ్డారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమని తెలిపారు. ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్(CM Revanth Reddy) మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్ల పిల్లలు కూడా తండ్రులను గుర్తుపట్టని పరిస్థితి రావడం దారుణమని ఆవేదన చెందారు. మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయి. డీజీపీ స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.