RS Praveen Kumar: బీర్లు, బిర్యానీ, రేవ్ పార్టీలే మీకు తెలుసు.. మంత్రి వ్యాఖ్యలపై ఆర్ఎస్పీ ఫైర్

by Ramesh N |   ( Updated:2024-11-29 13:35:52.0  )
RS Praveen Kumar: బీర్లు, బిర్యానీ, రేవ్ పార్టీలే మీకు తెలుసు.. మంత్రి వ్యాఖ్యలపై ఆర్ఎస్పీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ గురుకుల హాస్టళ్లలో వరకు ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై (BRS) బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) శుక్రవారం ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.

‘సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఏంటో తెలియని మీకు, బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు, ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు, నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు. కేటీఆర్ (KTR) గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా? దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రాండి, అంతే కాని మత్తులో ఉన్న ఈ మతిస్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి’ అంటూ కొండా సురేఖ, రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్పీ (RSP) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ ట్యాగ్ చేశారు.

Read More : Konda Surekha: గురుకులాల్లో కుట్రల వెనుక RS ప్రవీణ్ కుమార్.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed