KCR ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తాం: RS Praveen Kumar

by Rajesh |   ( Updated:2022-09-09 13:30:01.0  )
KCR ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తాం: RS Praveen Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపుహౌస్‌ల మునకతో రూ.1020 కోట్ల నష్టం ఏర్పడిందని, కన్నెపల్లిలో ఆరు మోటార్లు పనికిరావని, వాటి స్థానంలో కొత్తవి కొనాల్సిందేనని ప్రభుత్వానికి ఇంజనీర్ల బృందం నివేదిక ఇచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ లోపం వల్లే పంపు హౌస్‌లు మునిగాయని ఇంజనీర్ల బృందం తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అమెరికా పర్యటనలో ఉన్న బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపుహౌస్‌‌ల మునక నష్టాన్ని కేసీఆర్ కుటుంబమే భరించాలని డిమాండ్ చేశారు. 'లేదంటే మేమే మీ ఆస్తులను బహిరంగంగా వేలం వేస్తాం' అంటూ ట్వీట్ చేశారు.

ఉచిత చేపలు వద్దు.. చేపలు పట్టడం నేర్పండి

గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో ఆర్ఎస్పీ శుక్రవారం క్యాలిఫోర్నియాలోని ప్రవాస భారతీయులతో మాట్లాడారు. భారతదేశ రాజకీయ పరివర్తనలో ఎన్‌ఆర్‌ఐలు, మహిళలు, యువత చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. అవినీతిపరులైన రాజకీయ నాయకుల గురించి మాట్లాడి ఉచితాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఉచితంగా చేపలను ఇవ్వడాన్ని పక్కన పెట్టి ముందుగా చేపలు పట్టడం నేర్పించాలని పాలకులకు హితువు పలికారు.

Also Read: నేను మచ్చలేని మంత్రిని: మంత్రి పువ్వాడ

Advertisement

Next Story

Most Viewed