- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 2 కోట్ల ప్రాపర్టీపై అసోసియేషన్‌లో లొల్లి
దిశ, భిక్కనూరు: ఒకటి కాదు రెండు కాదు... నాలుగు నుంచి ఎనిమిది రూపాయల వరకు సంఘంలో మిత్తికి డబ్బులు తీసుకొని, రుసుము చెల్లించడంతో పాటు, నెలనెలా చిట్టి డబ్బులు కట్టామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అసోసియేషన్‌లో రూ.11 వేలు చెల్లించి కొత్తగా సభ్యత్వం పొందాలన్న ప్రతిపాదనపై చిన్న దుకాణాల యజమానులు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. ఈ మేరకు వారు మంగళవారం "దిశ"ను కలసి తమ గోడును వెల్లబోసుకున్నారు. తొలుత 30 మంది సభ్యులు ఉండగా, ఆ తరువాత 40 మంది సభ్యులతో కిరాణా అసోసియేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అసోసియేషన్‌ను అప్పట్లో మూడు భాగాలుగా(చౌరస్తా, కుమ్మర్ గల్లీ, ప్యాట్ల) విభజించి ఆయా ఏరియాలకు ఒకరిద్దరికి బాధ్యతలు అప్పగించి చిట్టీలు చేయడంతో పాటు, దుకాణాలకు వచ్చే సామానుకు రుసుముల చెల్లించి, అసోసియేషన్‌ను బలోపేతం చేశామని, ఆ విధంగా కూడ బెట్టగా వచ్చిన డబ్బులతో 1988 సంవత్సరంలో 20 గుంటల భూమిని కొనుగోలు చేశామన్నారు. అనివార్య కారణాలు, అనారోగ్య సమస్యల వలన కొందరు షాపులు మూసేసుకున్నారని, మరికొందరు యధావిధిగా షాపులు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే రూ.2 కోట్ల ప్రాపర్టీ విషయంలో తమకు ఎలాంటి వివరాలు తెలియజేయడం లేదని, పైగా అప్పట్లో తాము కూడా బెట్టిన రూ.8 లక్షల ఫిక్స్ డిపాజిట్లపై వివరాలు అడిగితే కనీసం లెక్కలు కూడా చూపడం లేదని వాపోయారు.
నిన్న మొన్నటి వరకు అసోసియేషన్‌కు వ్యతిరేకంగా అందరినీ ఏకం చేసి, రూ. 4కోట్ల ప్రాపర్టీలో ప్రతి ఒక్కరికి హక్కుంటుందని రచ్చ రచ్చ చేసిన అసోసియేషన్ ప్రతినిధి ఒకరి వద్దకు వెళ్లి అడిగితే, ఆయన కూడా సరిగా స్పందించక పోగా పూర్తిగా సైలెంట్ అయ్యాడన్నా రు. ప్రాపర్టీ విషయంలో తమకు హక్కు కల్పించడంపై కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్న అసోసియేషన్, ముందుగా అప్పట్లో ఫిక్స్ చేసిన రూ.8 లక్షలతో పాటు, బ్యాంకు బ్యాలెన్స్ వివరాల లెక్కలు చూపాలని, ఆ తరువాతే వారు చెప్పిన ప్రతిపాదనకు అగ్రి కావాలా..? వద్దా అన్న విషయమై ఆలోచిస్తామని స్పష్ట చేశారు. అసోసియేషన్‌లో కొందరు గూడుపుఠాణి చేస్తున్నారని, ఏది ఏమైనా ఆ ప్రాపర్టీ విషయంలో తమకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని అవసరమైతే లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని స్పష్టం చేశారు.