- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 425 కోట్ల వసూలు టార్గెట్! అధికారుల్లో టెన్షన్
దిశ, సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముఖ్యమైన సేవలు అందించే జిహెచ్ఎంసీ ఆర్థిక సంవత్సరానికి టార్గెట్ గా పెట్టుకున్న ఆస్తి పన్ను వసూళ్లకు పరుగులు పెడుతుంది. రూ.2 వేల కోట్ల ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ లక్ష్యంగా పెట్టుకున్న జిహెచ్ఎంసీ ఇప్పటివరకు రూ. 1580 కోట్లను వసూలు చేసుకోగా, మిగిలిన రూ.420 కోట్ల ప్రాపర్టీ టాక్స్‌ను రానున్న 24 గంటల్లో వసూలు చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా 140 మంది టాక్స్ ఇన్స్పెక్టర్లు, మరో 300 మంది బిల్ కలెక్టర్లకు ఇప్పటికే టార్గెట్లు నిర్ణయించి క్షేత్రస్థాయికి పంపారు.
ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజులైనా గురు, శుక్రవారాల్లోనూ ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ టార్గెట్‌కు అనుకూలంగా జరగాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు గురువారం నాటి ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్‌పై సిబ్బందితో ఆరా తీస్తున్నట్లు సమాచారం. గురువారం శ్రీరామనవమి సెలవు రోజు అయినప్పటికీ సిబ్బంది టాక్స్ కలెక్షన్‌పై దృష్టి సారించారు. వర్ధమాన ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కేవలం 48 గంటల సమయం ఉండడంతో కలెక్షన్‌పై అధికారులు సంబంధిత సిబ్బందితో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
- Tags
- ghmc
- properttax