రోడ్ల రిపేర్లకి రూ.1,150 కోట్లు అవసరం : ఆర్&బీ అధికారుల సమగ్ర నివేదిక

by M.Rajitha |
రోడ్ల రిపేర్లకి రూ.1,150 కోట్లు అవసరం : ఆర్&బీ అధికారుల సమగ్ర నివేదిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజుల పాటు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని రోడ్లన్ని తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. సుమారు రూ.1,134.58 కోట్ల మేర ఆర్&బీ శాఖ పర్యవేక్షిస్తున్న రోడ్లకి నష్టం వాటిల్లిందని ఆ శాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా అంచనా వేశారు. 510 ప్రదేశాల్లో రోడ్లు ధ్వంసం అవడంతో తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని, అందులో 336 ప్రదేశాల్లో ఇప్పటికే ఆ అంతరాయాన్ని స్థానిక అధికారుల సాయంతో తొలగించినట్టు తెలిపారు. మొత్తంగా 559 రోడ్లలో నీటి ఓవర్ ఫ్లో అయినట్టు, ఇందులో 331 ప్రదేశాల్లో తాము క్లియర్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. 82 రోడ్ బ్రీచ్ లను గుర్తించగా, అందులో 8 క్లియర్ చేశామని . రోడ్ల విభాగ ఉన్నతాధికారులు వివరించారు. వీటి అన్నింటిని తక్షణమే రిపేర్ చేసేందుకు రూ.255.63 కోట్లు అవసరం అవుతాయని ఆర్&బీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. శాశ్వత ప్రాతిపదికన రిపేర్ చేయాలంటే రూ.1,150 కోట్లు కావాలని సూత్రప్రాయంగా ప్రభుత్వానికి ఆర్&బీ ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం.

Next Story

Most Viewed