CM KCR: సీఎం కేసీఆర్‌తో రోహిత్ రెడ్డి భేటీ

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-19 05:11:55.0  )
CM KCR: సీఎం కేసీఆర్‌తో రోహిత్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇంటి నుంచి బయల్దేరిన రోహిత్ రెడ్డి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈడీ విచారణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో రోహిత్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే లీగల్ ఎక్స్ పర్ట్స్‌తో ఈ అంశంపై చర్చించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని ఈడీ కోరింది. వ్యాపార లావాదేవీలు, కంపెనీల వ్యవహారంపై ఈడీ రోహిత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది. బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై విచారణ సాగనుంది. ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగనున్నట్లు సమాచారం. ఈడీ విచారణ సందర్భంగా ఎం జరగబోతోందో అనే టెన్షన్ బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది.

Advertisement

Next Story