Revanth Reddy: ఆ బాలుడి చికిత్స ప్రజా ప్రభుత్వం బాధ్యత!.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by Ramesh Goud |   ( Updated:2024-08-27 15:35:45.0  )
Revanth Reddy: ఆ బాలుడి చికిత్స ప్రజా ప్రభుత్వం బాధ్యత!.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న రెండున్నరేండ్ల చిన్నారి చికిత్సకు నిధులు విడుదల చేసి, ఆపరేషన్ కు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! అని ఓ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. జనగామ జిల్లా జఫర్ గఢ్ మండలం తిమ్మంపేటకు చెందిన కుంభోజు మహేశ్వర్-అలేఖ్య దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు మాధవన్ జన్యు సంబంద వ్యాదితో బాధపడుతున్నాడు. ఆ బాలుడికి 15 రోజులకు ఒకసారి రూ.1.24 విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి.

బాలుడికి బోన్ మ్యారో శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. దానికి రూ. 24 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనానికి ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి, తక్షణ సాయానికి ఆదేశించింది. ఆ మేరకు సంబంధిత అధికారులు బాలుడి తల్లిదండ్రులను సంప్రదించి, వారి సమ్మతితో హైదరాబాద్ నిమ్స్ వైద్యులతో మాట్లాడి, చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ కు అవసరమయ్యే నిధులను ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అందించాలని నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed