- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCRను బలి తీసుకునేది అదే.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : కోట్లాది రూపాయల అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలితీసుకుంటే.. ఇప్పుడు ఆ ప్రాజెక్టే కేసీఆర్‌ను బలి తీసుకుంటున్నదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గుడినీ, గుడిలో లింగాన్నీ దిగమింగిన కేసీఆర్‌ను తెలంగాణ సమాజం శిక్షించాలన్నారు. కేసీఆర్ పాపం పండింది... కేసీఆర్ అవినీతి కుండ పగిలింది.. మేడిగడ్డ కుంగింది.. లక్ష కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసిన పన్నీరైంది.. అని వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న రాహుల్‌గాంధీకి శంషాబాద్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన అనంతరం మీడియాతో రేవంత్‌రెడ్డిపై కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీ కాపాడుతున్నదన్నారు. ఈ రెండు పార్టీల అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు, దాని పరిధిలోని బ్యారేజీలు బలవుతున్నాయన్నారు.
కేసీఆర్ అంటే ఇంతకాలం ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పుకున్నారని, ఇప్పుడు కాళేశ్వరం కరప్షన్ రావు అని సంబోధించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. దాదాపు రెండున్నర అడుగుల మేర కుంగిపోయినట్లు అధికారులే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ప్రాంతాన్ని కూల్చాల్సిన పరిస్థితి తలెత్తిందని, మిగిలిన పిల్లర్లు, బ్యారేజీని సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర్వాతనే బండారం బయట పడుతుందన్నారు. ప్రాజెక్టును నిర్మించిన ఎల్‌అండ్‌టీ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.
సంబంధిత ఇంజనీర్లు, సీడీఓపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించి తీరుతామన్నారు. ప్రధాని మోడీ కంకణం కట్టుకుని కేసీఆర్‌ను గెలిపించాలనుకున్నా అది జరగని పని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ సమాజం వాటిని తిప్పికొడుతుందని, కేసీఆర్‌ను కాపాడడం అసాధ్యమన్నారు. కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగి కాంగ్రెస్ నాయకుల ఇండ్లపై ఐటీ దాడులు చేయిస్తున్నదని, దీని వెనక కుట్ర ఏంటో ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.
Read More..
Medigadda Barrage: : మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనపై రాహుల్ సంచలన ట్వీట్