- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందుకోసమే కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని చెప్పా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. నువ్వా నేనా అంటూ పార్టీలు ఎన్నికల రణరంగంలో తలపడుతున్నాయి. ఈ క్రమంలో 14 సీట్లు గెలవడమే టార్గెట్ గా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ ను స్పీడప్ చేశారు. ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో పర్యటిస్తూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముఖ్యమంత్రికి కావాల్సిన అర్హతలన్ని ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రారజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న వేళ కోమటిరెడ్డికి సీఎం అర్హతపై రేవంత్ చేసిన కామెంట్స్ వెనుక ఉద్దేశం ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం ఈ అంశంపై మరోసారి ఆసక్తికర రీతిలో స్పందించారు.
మీడియా మిత్రులు దాన్ని మాత్రమే పికప్ చేశారు:
కోమటిరెడ్డికి సీఎంకు కావాల్సిన అర్హతలు ఉన్నాయని తాను చెప్పిన సందర్భాన్ని అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు కోమటిరెడ్డి బ్రదర్స్ ముఖ్యమంత్రికి మస్క కొడుతున్నారు, మంత్రి పదవి కోసం సీఎం కాళ్లు పట్టుకుంటున్నారు అంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. వాటిపై తాను స్పందిస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేయడంతో పాటు ఆమరణ నిరాహారదీక్ష చేశాడు. ఉమ్మడి ఏపీలోనే ఆయన మంత్రిగా పని చేశారు. ఇన్ని అర్హతలు ఉన్న ఆయన మస్కా కొట్టాల్సిన అవసరం లేదు. వారికి అర్హతే లేదు అన్నట్లుగా జగదీశ్వర్ రెడ్డి చేసిన విమర్శలపై తాను కౌంటర్ ఇచ్చానన్నారు. జగదీశ్వర్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. మీరు కేసీఆర్ సారాలో సోడా కలిపి మంత్రి తెచ్చుకుని మంత్రి పదవి తెచ్చుకున్నారు కాబట్టే అందరిని అలానే అనుకోవడం మంచిది కాదని తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఉన్న అర్హతలు చెప్పాన్నారు. దీన్ని మీడియా మిత్రులు తన మాటల్లో కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉంది అనే మాటలనే పికప్ చేశారని అన్నారు. తాను ఇప్పుడు కూడా చెబుతున్నాను వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కమిటెడ్ వర్కర్. వెంకట్ రెడ్డి మంత్రి పదవి కోసం పైరవీ చేసుకునే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ లో అందరం సమిష్టిగా పని చేస్తున్నామన్నారు.