టీ కాంగ్రెస్ రెండో జాబితాలో రేవంత్ రెడ్డి పేరు..! ఆ సీటు ఫిక్స్..!

by Javid Pasha |   ( Updated:2023-10-27 10:29:59.0  )
టీ కాంగ్రెస్ రెండో జాబితాలో రేవంత్ రెడ్డి పేరు..! ఆ సీటు ఫిక్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఏ క్షణమైనా జాబితా ప్రకటించనున్నారు. 45 మంది అభ్యర్థులతో సెకంట్ లిస్ట్ రిలీజ్ కానుండగా.. ఇందులో చాలామంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించనున్నారు. కూకట్‌పల్లి నుంచి బండి రమేశ్, తాండూర్ నుంచి మనోహర్ రెడ్డి, వనపర్తి నుంచి మేఘారెడ్డి, కరీంనగర్ నుంచి సంతోష్ కుమార్‌, బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి, శేరిలింగంపల్లి నుంచి జగదీశ్వర్ రెడ్డికి సీటు దక్కనుందని తెలుస్తోంది.

ఇక మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి శ్యాంనాయక్, బోథ్ నుంచి బాబూరావ్ రాథోడ్ పేరు ఉండే అవకాశముంది. అలాగే రెండో జాబితాలో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పేరు ప్రకటించనుండగా..నిజామాబాద్ అర్బన్‌కు షబ్బీర్ అలీని షిఫ్ట్ చేయనున్నారని సమాచారం. రెండో జాబితా ప్రకటనపై గత కొద్దిరోజులుగా చర్చిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ, సీఈసీ వరుస భేటీలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేసింది.

సీపీఎం, సీపీఐకు చెరో రెండు సీట్లు ఖరారు చేయగా.. 15 నియోజకవర్గాల్లో ఆశావాహుల పోటీ ఎక్కువగా ఉంది. దీంతో ఆ నియోజకవర్గాల్లో ఎవరికి సీటు ఇవ్వాలనే దానిపై ఏఐసీసీ ఆచితూచి అడుగులు వేస్తోంది. రెండో లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత పెండింగ్ సెగ్మెంట్లకు నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed