రేవంత్ రెడ్డి ఖాకీ నిక్కర్ కామెంట్స్.. అక్బరుద్దీన్ స్ట్రాంగ్ వార్నింగ్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-13 09:54:58.0  )
రేవంత్ రెడ్డి ఖాకీ నిక్కర్ కామెంట్స్.. అక్బరుద్దీన్ స్ట్రాంగ్ వార్నింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు వేలం పాటకు సిద్ధంగా ఉండాలన్నారు. తాను ప్రసంగిస్తే దేశమంతా వణికిపోతుందన్నారు. తమ జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇక, రేవంత్ రెడ్డి అసదుద్దీన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసద్ తన షెర్వానీ లోపల పైజమా ఉందనుకున్నానని కానీ లోపల ఖాకీ నిక్కర్ ఉందన్నారు. ముస్లింల హక్కుల కోసం వాళ్ల నాన్న బారిష్టర్ చదివిస్తే అసద్ మాత్రం ముస్లింలను ఇబ్బంది పెట్టే పార్టీకి మద్దతు ఇస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ పై మజ్లిస్ ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని రేవంత్ ఫైర్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story