ఒకే రోజు నాలుగు పరీక్షలు అవివేకం: Revanth Reddy

by GSrikanth |   ( Updated:2023-04-29 14:52:40.0  )
ఒకే రోజు నాలుగు పరీక్షలు అవివేకం: Revanth Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏప్రిల్ 30న ఒకే రోజు నాలుగు శాఖల పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ అవివేకం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఈ నిర్ణయం శాపంగా మారిందిందని దుయ్యబట్టారు. ఈ నాలుగు పోటీ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రభుత్వం రీ షెడ్యూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పించేలా ఈ విషయంలో సీఎం కేసీఆర్ తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు.

కాగా ఈనెల 30వ తేదీన కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్(ఏఈ), జూనియర్ లైన్ మెన్ (జెఎల్ఎం) పరీక్షలు ఒకేరోజున ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయించింది. దీని వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలే అరకొర నోటిఫికేషన్లు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఉన్న నాలుగు పోటీ పరీక్షలను ఒకే రోజు నిర్వహిస్తే అన్ని పరీక్షలకు అర్హత కలిగి ఉన్నప్పటికీ ఏదో ఒక పరీక్షకు మాత్రమే హాజరై మిగతా మూడు పరీక్షలకు దూరం కావాల్సి వస్తుందని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read: రాత్రి సమయంలో పెరుగు తింటే ప్రమాదమా..? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

BRS ఎమ్మెల్యేలపై ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

Advertisement

Next Story

Most Viewed