ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా? కేటీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్

by Javid Pasha |   ( Updated:2023-10-26 12:24:34.0  )
ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా? కేటీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఇవాళ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. రైతు బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదుపై స్పందించారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని, అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ పోస్ట్‌పై టీపీసీసీ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు.. నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు, నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు, నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు, నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే, నీలాంటి వాడిని చూసే... “నిజం చెప్పులు తొడుక్కునే లోపు.. అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది” అనే సామెత పుట్టింది. డ్రామాలు ఆపి... నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వు.. లేదంటే కాంగ్రెస్ వచ్చిపెంచిన మొత్తంతో కలిపి ఇస్తుంది.’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed